ఈనెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవి నాయకత్వంలో కలిసే అపాయింట్ మెంట్ ఖరార్ కావడంతో చిరంజీవితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను ఎవరెవరు కలవబోతున్నారు అన్నవిషయమై లీకులు వస్తున్నాయి. చిరంజీవితో పాటు నాగార్జున ఆదిశేషగిరి రావు విజయ్ చందర్ చిరంజీవి మోహన్ బాబు ఇలా చాలమంది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సుమారు 10 మందికి పైగా ఒక టీమ్ గా వెళ్ళడానికి రంగంసిద్ధం అయినట్లు టాక్.


అయితే ఈటీమ్ లో ఉన్న చాలామంది 60 సంవత్సరాలు పై ఉన్నవారు కావడంతో వీరందర్నీ కలుపుకుంటూ ఇప్పుడు కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో ఎలా విజయవాడకు వెళ్ళాలి అన్న విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరంతా కలిసి ఒక ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళి రావాలని ఆలోచన వచ్చినా ఇది చాల ఖర్చుతో కూడుకున్న పని అని ఎవరికి వారు విడిగా వారివారి కార్లలో ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళడానికి ఒక రూట్ మేప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్లి అక్కడ షూటింగ్ లకు అనుమతుల కోసం ముఖ్యమంత్రి జగన్ ను కోరే ఉద్దేశ్యం ఇండస్ట్రీ ప్రముఖులకు ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి షూటింగ్ లు ప్రారంభించాలి అంటే రూపాయికి 10 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరు ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి షూటింగ్ లు మొదలు పెడతారు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఈపరిస్థితులు ఇలా ఉంటే ముఖ్యమంత్రి జగన్ తో జరగబోయే సమావేశానికి బాలకృష్ణను రమ్మని ఆహ్వానించడం స్వయంగా చిరంజీవి చేయకుండా నిర్మాత కళ్యాణ్ బాలయ్యను ఆహ్వానించడం ఏమిటి అంటూ బాలయ్య అభిమానులు మండి పడుతున్నారు.


ఎన్ని భేధాభిప్రాయలు ఉన్నా బాలకృష్ణ చిరంజీవి ఇండస్ట్రీలో సమఉజ్జీలు అనీ అలాంటి పరిస్థితులలో బాలయ్య సీనియారిటీని గుర్తించి చిరంజీవి స్వయంగా బాలయ్యను గౌరవంగా ఆహ్వానించకుండా మధ్యలో నిర్మాత కళ్యాణ్ రాయబారాలు ఏమిటి అంటూ బాలయ్య అభిమానులు అసహనంతో రగిలి పోతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: