ఇండస్ట్రీ అంతా ఒకే మాట మీద ఉండటం ఒక బూతు పదంతో సమానం అని రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కొందరు టార్గెట్ రాజమౌళి అంటూ కొందరు దర్శకులు తీవ్ర అసహనంలో ఉన్నారు అంటూ గాసిప్పులు సందడి చేస్తున్నాయి. ఇలా కొందరు దర్శకులకు రాజమౌళి పై అసహనం ఏర్పడటానికి ఒక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.


చిరంజీవి ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర పోషిస్తూ షూటింగ్ లు ఎలా ఎప్పుడు మొదలుపెట్టాలి అంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులతో చర్చలు చేస్తున్నట్లుగా రాజమౌళి కూడ ఆతరహా చర్చలు చేస్తూ దర్శకుల సంఘాన్ని కాదని తన చేతిలోకి నాయకత్వ పగ్గాలు పరోక్షంగా తీసుకుంటున్నాడు అంటూ కొందరు దర్శకులు అసహనంలో ఉన్నారని గాసిప్పులు వస్తున్నాయి. రాజమౌళి దర్శకులతో పెడుతున్న సమావేశాలకు కొందరి దర్శకులను పిలిచి మరికొందరిని పిలవడం లేదని టాక్.


అంతేకాదు రాజమౌళిని తమ భవిష్యత్ సినిమాల అవసరాల రీత్యా కొరటాల శివ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే భావనలో కూడ ఇండస్ట్రీ వర్గాలు ఉన్నట్లు టాక్. దీనితో షూటింగ్ లు మొదలు కాకుండానే అటు హీరోలు ఇటు దర్శకుల మధ్య బయట పడని ఇగోలు ఇప్పుడు బయట పడుతున్నాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈమధ్య ఒక అగ్ర హీరో పుట్టినరోజునాడు ఒక అగ్ర దర్శకుడు కనీసం అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడ చెప్పక పోవడం ఈ ఇగో ల సమస్య కారణమే అన్న ప్రచారం జరుగుతోంది.

 

ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న విధంగా పూర్తి కాకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కుంటున్న రాజమౌళికి ఇప్పుడు తనను టార్గెట్ చేస్తూ కొందరు దర్శకులు చేస్తున్న ప్రచారం చూసి ఆశ్చర్య పోతున్నట్లు టాక్. దీనితో కరోనా కాదు మరిన్ని ఉపద్రవాలు వచ్చినా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో రాజకీయాలలో ఐఖ్యత రావడం కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: