ప్రిన్స్ మహేష్, గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన క్రేజీ మూవీ ఒక్కడు. అప్పటివరకు మహేష్ సినిమా అంటే కృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రమే చూసే వారు అనుకున్నారు. అయితే ఒక్కడు సినిమా మహేష్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. అంతేకాదు మహేష్ కెరియర్ లో తొలి కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్ అంటే అది ఒక్కడు సినిమానే. మహేష్ రేంజ్ పెంచిన సినిమా అది. మహేష్, భూమిక జంటగా నటించిన ఈ సినిమాను సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో ఎమ్మెస్ రాజు నిర్మించారు. 

 

ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మహేష్ కెరియర్ ను టర్న్ చేసిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు.  చదువు మీద ఇంట్రెస్ట్ లేని హీరో.. కబడ్డి ఆడటానికి కర్నూలు వెళ్తాడు.. అక్కడ ఓబుల్  రెడ్డితో గొడవ పడతాడు. ఓబుల్ రెడ్డి సొంతం చేసుకోవాలని అనుకున్న స్వప్నని తీసుకుని హైదరాబాద్ వస్తాడు. ఆ కేసు హీరో తండ్రి దగ్గరకే రావడం.. హీరో ఇంట్లోంచి పారిపోవడం జరుగుతుంది. ఫైనల్ గా ఆ ఓబుల్ రెడ్డిని కబడ్డీ గ్రౌండ్ లోనే అంతం చేస్తాడు అజయ్ అదేనండి మన హీరో. 

 

సినిమా కోసం గుణశేఖర్ వేసిన చార్మినార్, ఆ సరౌండింగ్స్ సెట్ బాగా పాపులర్ అయ్యాయి. మహేష్ లో కూడా మంచి విషయం ఉందని ప్రూవ్ చేసిన సినిమా. కరెక్ట్ సినిమా పడాలే కానీ తన సత్తా ఏంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేసిన సినిమా ఒక్కడు. ఈ సినిమాలో అన్ని కాంబినేషన్స్ బాగా కుదరడంతో సినిమా సెన్సేషనల్  హిట్ అయ్యింది. తెలుగులోనే కాదు ఒక్కడు సినిమా రీమేక్ అయినా అన్నిచోట్లా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను తమిళంలో విజయ్ గిల్లిగా రీమేక్ చేసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: