ఇటు టాలీవుడ్ లో అయినా అటు తమిళంలో అయినా ఏ భాషలో అయినా సరే సంచలనం సృష్టించిన చిత్రం చంద్రముఖి. రజని కాంత్ ప్రధాన పాత్రలో జ్యోతిక హీరోయిన్ గా ప్రభు ఇతర నటులు కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా వచ్చే వరకు కూడా ఈ సినిమా కథ ఒక సంచలనం. అప్పటి వరకు అలాంటి కథ తో ఎవరూ కూడా సినిమా చెయ్యాలి అనే ఆలోచన కూడా దాదాపు గా చేయలేదు అనే చెప్పాలి. ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. 

 

ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే జనాలు పనులు మానుకుని మరీ చూసే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ఈ సినిమాలో జ్యోతిక నటన తో పాటుగా రజని నటన చూసిన విమర్శకులు అయితే ఆ సినిమా ఆ ఇద్దరు మినహా ఎవరూ కూడా చేసే అవకాశం లేదని వ్యాఖ్యలు కూడా చేసారు. ఆ విధంగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇండియన్ సినిమాలో ఆ సినిమా ఒక సంచలనం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాను చాలా మంది ఇష్టపడటమే కాదు ప్రతీ సన్నివేశాన్ని కూడా ఫీల్ అయ్యారు అనే విధంగా ఉంటుంది ఆ సినిమా అనేది వాస్తవం. 

 

సినిమా తర్వాత హీరోయిన్ జ్యితికకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ఆమె కూడా చాలా వరకు జాగ్రత్తగా సినిమాలను చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇక రజని కాంత్ సినిమాలు అనగానే అదే స్థాయిలో ఉంటాయి అనే అభిప్రాయం కూడా జనాలకు వచ్చింది. ఆ విధంగా ఆ సినిమా ఒక సంచలనం సృష్టించింది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: