ఈ మధ్య కాలంలో ఇద్దరి స్టార్ హీరోల కాంబినేషన్ లో కుటుంబ భరిత సినిమాలు ఒకటి అరా వస్తున్నాయి తప్ప ఎక్కువగా అసలు రావడం లేదు. అప్పట్లో ఏఎన్నార్ - ఎన్టీఆర్ ఎన్టీఆర్ - శోభన్ బాబు, ఏఎన్ఆర్ - శోభన్ బాబు, కృష్ణ - ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల కాంబినేషన్లో ఎన్నో ఫ్యామిలీ డ్రామా సినిమాలు వచ్చేవి. కానీ అవేమీ ఇప్పట్లో రావడం లేదని చెప్పుకోవచ్చు. వాటన్నిటికీ భిన్నంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని మహేష్ బాబు వెంకటేష్ లను మల్టీ స్టారర్ గా పెట్టి తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. 2013వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు పరిశ్రమలో భారీ హిట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ మహేష్ బాబు వెంకటేష్ అంజలి సమంత రావు రమేష్ పాత్రలను చాలా సహజంగా రూపుదిద్దాడు దర్శకుడు. రేలంగి(ప్రకాష్ రాజ్) ఎప్పుడు నవ్వుతూ తన కుమారులను చాలా చక్కగా పెంచి పెద్ద చేస్తాడు. 


ఎవరితో శత్రుత్వం పెంచుకోని రేలంగి అంటే గీత(సమంత) తండ్రికి బాగా చులకన. ఎదుగు పొదుగు లేకుండా ఎప్పుడూ ఉన్నచోటే ఉంటూ డబ్బులు సంపాదించకుండా ఉంటారు ఏంట్రా అంటూ తాను రేలంగి కుమారుల పై ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూ నే ఉంటాడు. కానీ వాళ్ళ చివరికి అతడి కుటుంబానికి ఎంతో సహాయం చేసి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడుతారు. దాంతో గీత తండ్రి తన తప్పు తాను తెలుసుకొని పెద్దోడు చిన్నోడు ని బాగా గౌరవిస్తాడు. పెద్దోడికి సీత తో పెళ్లి అయిపోతుంది. ఆపై సినిమాకి ఎండ్ కార్డు పడుతుంది. 


చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చూడవలసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల క్రెడిట్ దక్కాల్సిందే. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మణిశర్మ అద్భుతంగా సంగీతం సమకూర్చే అనిపించారు. అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు అత్యద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మధురమైన మీనింగ్ ఫుల్ పాటలకు మిక్కీ జే మేయర్, మణిశర్మ సంగీతం ప్రాణం పోసి ప్రేక్షకుల మనసులను నేరుగా తాకాయి. ఏది ఏమైనా నేటి తరంలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: