సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ రోల్ లో దుల్కర్ సల్మాన్ నటించగా... విజయ్ దేవరకొండ, సమంత ముఖ్య పాత్రల్లో నటించారు. మే 9, 2018 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం సావిత్రి పుట్టిన దగ్గర నుండి మరణించేవరకు కళ్ళకు కట్టినట్టు ప్రేక్షకులకు చూపించి ఫిదా చేసేసింది. ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలను... సావిత్రి జీవితంలో చోటు చేసుకున్న ప్రేమలు, ఆప్యాయతలు, అసూయలు ఈర్ష్య, కోపం, పాపులారిటీ, మోసం, పతనం, చావు వంటివి చాలా సహజం చూపించి సావిత్రి పక్కన నడుస్తూ ఆమె జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కల్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

IHG

నిజానికి తెలుగులో ఒకరి జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా చూపించిన చిత్రాలలో మహానటి సినిమా కచ్చితంగా టాప్ ప్లేస్ సంపాదించుకుంటుంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది కానీ ఆమె నటన ప్రతిభకు ఈమె ప్రతిభకు చాలా వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాస్ట్యూమ్ డిజైనర్స్, మేకప్ డిపార్ట్మెంట్ కష్ట ఫలితంగా ఆమె కాస్త అటో ఇటో సావిత్రి పాత్రలో చూడ్డానికి బాగానే కనిపించింది. ఆమె కు వాయిస్ ఓవర్ ఇచ్చిన వారు కూడా చాలా చక్కగా చెప్పారు. 

IHG
ఈ చిత్రం ఫస్టాఫ్ లో సావిత్రి చిన్ననాటి జీవితం ఆనందోత్సాహాలతో గడవడం, ఆపై బ్రహ్మాండమైన సినీ కెరీర్ లో ఆమె ఎదుగుదల గురించి చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత జెమినీ గణేషన్ ఆమె జీవితంలో అడుగుపెట్టడం, ఆమె జీవితాన్ని సర్వ నాశనం చేయడం చూపించబడింది. సినిమా సినిమాటోగ్రఫీ, సెట్స్ అన్ని ప్రేక్షకుడిని సావిత్రి యుగానికి తీసుకెళ్తాయి. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సావిత్రి జెమిని గణేషన్ ల కోసం రాసిన డైలాగులు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనా సావిత్రి గురించి తెలిసిన వాళ్లకి ఈ చిత్రం పెద్ద బహుమతి అయ్యిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: