ప్రముఖ కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన కేజిఎఫ్ మూవీ లో పంచు డైలాగులు, అమ్మ గురించి చెప్పే మరొక డైలాగ్ భారత దేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో యష్ చాలా శక్తివంతమైన వాడని, తాను గన్నులతో ఉన్న 50 మంది రౌడీలను కూడా కేవలం కత్తితో చంపేస్తాడని ఈ సినిమాల్లో చూపిస్తారు. అవన్నీ ప్రాక్టికల్ గా వర్కవుట్ కాకపోయినా... హీరో పాత్రని ఓవర్ గా ఎలివేట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. 


మూవీ స్టోరీ లైన్ తెలుసుకుంటే... ధనికుడు అవ్వాలనే పట్టుదలతో రాఖీ అనే ఒక కుర్రోడు తన సొంత గ్రామం విడిచి ముంబాయి నగరంలో కాలు మోపుతాడు. కాలక్రమేణా తాను ముంబాయి నగరంలో క్రైమ్ బాస్ గా ఎదుగుతాడు. ఆ క్రమంలోనే బెంగళూరు నుండి గోల్డ్ మైనింగ్ ఏరియా కేజిఎఫ్ లో ఒక పెద్ద డాన్ ని చంపాలని అతనికి ఆఫర్ వస్తుంది. రాఖీ అంత పెద్ద వాడిని ఎదుర్కొని అతన్ని చంపేస్తాడా? కేజిఎఫ్ ప్రాంతానికి రాఖీ చిన్నతనాన్ని కి సంబంధం ఏంటి? అనే అంశాలను సినిమాలో చూపించాడు దర్శకుడు. 


హీరో యష్ కి కన్నడ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని లుక్, స్టయిల్, నిలువెత్తు రూపం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కే జి ఎఫ్ సినిమా లో యష్ గడ్డం లుక్కుతో, మంచి హెయిర్ స్టైల్ తో సూపర్ హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఫైట్ సీన్లు కూడా చాలా ఓవర్ గా పెట్టారు కానీ అవి మాత్రం ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యష్ ఎంటర్ అయ్యే ప్రతి సన్నివేశం ఒక ఇంట్రడక్షన్ లాగానే ఉంటుంది. దాని కోసం సినిమాలో ఎన్నో షాట్లను ఎడిటింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ఒక సన్నివేశంలో యష్ తన తుపాకిని కేవలం మిల్లి సెకండ్లలోనే రీలోడ్ చేస్తాడు. ఇక్కడ ఎడిటింగ్ బాగా చేశారు అని అర్థమవుతుంది. హీరోయిన్ పాత్ర కూడా ఇందులో కేవలం ఐదారు నిమిషాల కంటే ఎక్కువగా ఉండదు. ఏది ఏమైనా ఈ సినిమా లోని పంచ్ డైలాగులు, యష్ హీరోయిజం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: