కోర్టు డ్రామా చిత్రమంటేనే ఎన్నో చిక్కుముడులు లతో అందరినీ ఆలోచింపజేసే కథాంశంతో తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో కోర్టు డ్రామాతో తెరకెక్కిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. కోర్టులో చోటుచేసుకునే సన్నివేశాలు అందరి ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తాయి. మన భారతదేశంలో కోర్టు డ్రామా చిత్రాలు ఆస్కార్ అవార్డులకు ఎంపిక అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. హిందీలో అమితాబ్ బచ్చన్ తారాగణంతో తెరకెక్కిన పింక్ చిత్రం కూడా అశేషమైన ప్రేక్షకాదరణ పొంది బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. కేవలం 23 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఏకంగా 107 కోట్ల రూపాయలను సంపాదించిపెట్టింది. దీన్ని బట్టి ఆ చిత్రం ఎంతలా హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ చిత్రానికి రీమేక్ గా తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 


ఒరిజినల్ మూవీ లో అమితాబ్ బచ్చన్ న్యాయవాది పాత్రలో నటించగా పవన్ కళ్యాణ్ కూడా అదే పాత్రలో కనిపించనున్నాడు. ముగ్గురు యువతులు ఒక నేరం లో ఇరుక్కుపోతే వాళ్ళని కాపాడేందుకు న్యాయవాది ముందుకు వచ్చే కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాప్సీ పన్ను, కీర్తి కొల్హర్నీ, ఆండ్రియా ముగ్గురు యువతుల పాత్రల్లో నటించగా... అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వం వహించాడు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ(సరికొత్త నటి) ముగ్గురు యువతుల పాత్రలలో నటిస్తుండగా... వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది కానీ కొంచెం ప్యాచ్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ చిత్రం నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. అదేంటంటే... కోర్టు సన్నివేషాలలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సూపర్ థ్రిల్లింగ్ గా వచ్చాయట. పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ ఎంత అద్భుతంగా థ్రిల్లింగ్ గా వెంట్రుకలు నిక్క పొడిచే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమాలలో ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తన న్యాయవాది పాత్ర ద్వారా రెచ్చిపోయాడు అని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆ చిత్రం నుండి విడుదలైన మగువా ఓ మగువా సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో భారీ హిట్ అయ్యింది. ఎస్ఎస్ తమన్ సంగీతం కూడా రుచి చూసేందుకు పవన్ అభిమానులు బాగా వేచి చూస్తున్నారు. ఈ చిత్రం మంచి కథ నేపథ్యంతో పవన్ కళ్యాణ్ హీరోయిజం తో తెలుగు పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోందని ద్వితీయ ఆలోచనలు లేకుండా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: