భాషా... ఇండియన్ సినిమాలో ఈ సినిమా ఒక సంచలనం. అప్పటి వరకు సినిమాలను ఈ విధంగా కూడా చేయవచ్చా అని నిరూపించిన సినిమా ఇది. ఏ హీరో అయినా ఏ దర్శకుడు అయినా ఏ నిర్మాత అయినా ఎవరు అయినా సరే ఈ సినిమాను చూసి దాక్ అయ్యారు. ఆ విధంగా ఉంది ఆ సినిమా. ప్రతీ సీన్ కూడా సినిమాలో ఒక సంచలనం అనేది వాస్తవం. సినిమా అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఈ సినిమాను తీసుకొచ్చారు. అప్పటి వరకు ఫ్లాష్ బ్యాక్ అనేది సినిమాల్లో లేదు. దాదాపుగా ఉన్నా సరే కథను ఆ విధంగా డామినేట్ చేసిన ఫ్లాష్ బ్యాక్ అనేది లేదు అనే చెప్పాలి. 

 

కాని ఈ సినిమాలో అదే హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక రజని నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఈ సినిమాలో సంచలనం అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా ఆయన చాలా బాగా చూపించారు. దర్శకుడు కూడా ఈ సినిమాను ఒక రేంజ్ లో ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాలో రఘువరన్ విలన్ గా చేసిన నటన చూసిన ప్రేక్షకులు అతన్ని వామ్మో అనే విధంగా ఉంది. ఈ సినిమా తర్వాత రజని రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట కూడా వాస్తవం. ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక తెలియని క్రేజ్ వచ్చింది. 

 

సినిమా తర్వాత కమర్షియల్ అనేది కూడా సినిమాలకు పరిచయం అయింది. స్టార్ హీరోల సినిమాలకు వసూళ్లు అంటే ఆ విధంగానే వస్తాయి అనే విధంగా ఈ సినిమా ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో నిర్మాతలు కూడా వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: