రజని కాంత్ కెరీర్ లో వచ్చిన అతి పెద్ద విజయం సాధించిన సినిమాల్లో ఒకటి నరసింహ. అప్పటి వరకు కూడా ఒక స్టార్ హీరోయిన్ ని విలన్ గా చూపించవచ్చు దానికి తోడు ఒక లేడీ హీరోయిన్ ని విలన్ గా చూపించవచ్చు అనేది ఎవరికి తెలియదు. ఏ స్టార్ హీరో అయినా ఏ స్టార్ నిర్మాత అయినా ఎవరు అయినా సరే అలాంటి సినిమా చేయవచ్చు అనే ఆలోచన కూడా దాదాపుగా చేయలేదు అనే చెప్పాలి. సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ఒక స్థాయిలో ఉంది అనేది వాస్తవం. సినిమాను ఈ విధంగా ప్రేక్షకులకు అందించవచ్చు అనేది ఈ సినిమా తర్వాత ప్రూవ్ అయింది. 

 

సినిమా ఒక ట్రెండ్ సృష్టించింది. అప్పటి వరకు లేడీ విలన్ తో సినిమా చేయవచ్చు అనే ఆలోచన పెద్దగా ఎవరు చేయలేదు. అంతకు ముందు అలాంటి సినిమాలు వచ్చినా సరే ఆ విధంగా హిట్ కాలేదు అనే చెప్పాలి. కాని ఆ సినిమా తర్వాత లేడీ విలన్ లకు డిమాండ్ చాలా బాగా పెరిగింది అనే చెప్పవచ్చు.  ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన చూసిన విమర్శకులు కూడా ఈ సినిమాలో ఆమె మినహా ఎవరూ కూడా సరిపోయే అవకాశం లేదు అని కామెంట్ చేసారు. ఈ సినిమాలో ఆమె నటన ఆ విధంగా ఉంది మరి. రజని కూడా అదే స్థాయిలో ఊపెసారు. ఇద్దరూ కూడా నువ్వా నేనా అనే విధంగా నటించారు అనే చెప్పాలి. 

 

రజని కాంత్ తో రమ్యకృష్ణ పోటీ పడి నటించింది అనే మాట వాస్తవం. ఆ విధంగా ఈ సినిమాలో వాళ్ళు హైలెట్ అయ్యారు. ఇలాంటి కథల కోసం దర్శక నిర్మాతలు తర్వాత తర్వాత ట్రై చేసినా సరే పెద్దగా విజయం సాధించలేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: