సీతయ్య... హరికృష్ణ కెరీర్ లో వచ్చిన అతి పెద్ద హిట్. ఆయన సినిమాలు చాలా తక్కువే అయినా ఈ సినిమా తర్వాత ఆయన కెరీర్ ఒక రేంజ్ లోకి వెళ్తుంది అని భావించిన ఆయన మాత్రం సినిమాలకు చాలా వరకు దూరంగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అయన నటన గురించి కూడా టాలీవుడ్ లో చర్చ జరిగింది. ఇక సినిమా విషయానికి వచ్చి చూస్తే ఈ సినిమా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సృష్టించింది అనే చెప్పవచ్చు. అది ఎందుకు అని అంటే సాధారణంగా రాయలసీమ ఫ్యాక్షన్ విషయంలో పోలీసుల పాత్ర మీద సినిమాలు చేయలేదు. అంతే కాదు పోలీసులు ఆ విధంగా హీరోగానే కాదు ఫ్యాక్షన్ లో కూడా ఉంటారు అని ఆ సినిమాలో చూపించారు. 

 

సినిమా కథ ఒక సంచలనం అనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో పోలీస్ గా హరికృష్ణ నటన చాలా హైలెట్ అనేది వాస్తవం. పోలీసులు ఆ విధంగా సినిమాలు చేయవచ్చు అని ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది. కథ బాగుండటమే కాదు ప్రతీ నటుడు కూడా ఈ సినిమాలో తమ సినిమా అనే విధంగా నటించి మెప్పించారు. ఇక దర్శకుడు సినిమాను తీసిన విధానం కూడా హైలెట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హరికృష్ణ ఒకరే కాదు సినిమాలో విలన్ గా నటించిన ముఖేష్ రుషి కూడా సినిమాలో జీవించారు. 

 

సినిమా తర్వాత హరికృష్ణ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇక ఈ సినిమాలో ఉండే పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఈ సినిమా అప్పుడు ఒక ఊపు ఊపింది. ఈ సినిమా తర్వాత శివమణి లాంటి సినిమాలు వచ్చాయి. లక్ష్మీ నరసింహ సినిమా కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా హిట్ అయింది సీతయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: