అనేకమంది నిర్మాతలు దర్శకులు అంతాకలిసి చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి షూటింగ్ లకు అనుమతులు ఇమ్మని కోరుతున్నా లోలోపల జరుగుతున్నది వేరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వైపు ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటిభారీ సినిమాలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా టాప్ హీరోలు చాలమంది ఇప్పట్లో తాము షూటింగ్ లకు రాలేమని సున్నితంగా చెపుతూ టాప్ ప్రొడ్యూసర్స్ ఉత్సాహాన్ని నీరు గారుస్తున్నట్లు తెలుస్తోంది.  


ఇలాంటి పరిస్థితులలో కొందరు టాప్ నిర్మాతల ఆలోచనలు కూడ మారిపోయాయి అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇంత హడావిడిగా సినిమా షూటింగ్ లు మొదలుపెట్టి కష్టపడి పూర్తి చేసినా థియేటర్స్ ఓపెన్ కాకుండా ఈ సినిమాలు పూర్తి చేసి ఏమి సాధించాలి అని నిట్టూర్పులు విడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి అభిప్రాయం చాలామంది టాప్ ప్రొడ్యూసర్స్ కు ఏర్పడటం వెనుక ఒక కారణం ఉంది అన్నప్రచారం జరుగుతోంది.


అర్జెంట్ గా ఒక హీరోను ఆ సినిమాకు సంబంధించిన బ్యాలన్స్ షూటింగ్ కు పిలవాలి అంటే ఆ హీరోకు సంబంధించి నిర్మాతలు ఇవ్వవలసిన బ్యాలెన్స్ రెమ్యూనిరేషన్ కోట్ల రూపాయలో ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా అసలు సినిమాలకు జనం వస్తారో రారో తెలియకుండా సినిమా నిర్మాణం కోసం భారీ మొత్తాలు అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటూ మరిన్ని కష్టాలలోకి వెళ్ళకుండా మరికొంతకాలం వేచి చూడటమే మంచిది అన్న అభిప్రాయంతో చాలమంది భారీ నిర్మాతలు ఉన్నారు అంటూ సరికొత్త ప్రచారం మొదలైంది.


దీనితో ఏదో హడావిడి చేయాలని చాలమంది నిర్మాతలు  ఆఫీసులు తీసుకుని కూర్చోవడం తప్ప సినిమా నిర్మాణాల విషయంలో హడావుడి అనవసరం అన్న అభిప్రాయంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా కరోనా సమస్యలు నిర్మాతలకు చాలా తెలివి టలు నేర్పించాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: