స్వయం కృషి తో సినిమాలలో రాణించిన హీరో చిరంజీవి.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్థిరమైన ఒక పేరును సంపాదించుకున్నాడు..అందుకే అందరికీ చిరంజీవి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అలాంటి ఆయన కుటుంబంలో ఎందరో హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు.అందుకే మెగా ఫ్యామిలీ అంటే అందరికీ గౌరవం.ఆ గుర్తింపు తో సినిమాలు హిట్ అవుతున్నాయి. 

 

 

 


చిరంజీవి వారసుడుగా పరిచయమైన హీరో రామ్ చరణ్.. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ మెగా ప్రిన్స్ చరణ్సినిమా అనుకున్న హిట్ ను అందించలేక పోయింది.. అయిన మెగా వారసుడు అనే ఒక్క క్రేజ్ తో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకున్నారు.రచ్చ, మగధీర, ఎవడు, నాయక్ ఇలా ఎన్నో సినిమాలలో నటించిన రామ్ చరణ్ కు మంచి హిట్ ను అందించాయి..అలా ఇప్పుడు టాప్ హీరో లలో ఒకడుగా నిలిచాడు.. 

 

 

 

 

చరణ్ సినిమాలలో అతి పెద్ద హిట్ నీ అందించిన సినిమా అంటే అది మగధీర అని చెప్పాలి..రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది..అప్పటి రాజులు వారి రాజకీయ విశేషాలు గురించి ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.. సినిమా కథతో పాటుగా పాటలు మాటలు.. అన్నీ జనాలకు నచ్చడంతో సినిమాను సూపర్ హిట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: