రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెంగ్విన్.  లేడీ ఓరియెంటెడ్ మూవీగా తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా  డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.  లీడింగ్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ,పెంగ్విన్ హక్కులను దక్కించుకుంది. ఈనెల 19న ప్రైమ్ ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ లో ఉంచనుంది. ఈ చిత్రం కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు ,మళయాలం ,ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది. ఇక ఈ సినిమా టీజర్ మధ్యాహ్నం 12గంటలకు విడుదలకానుంది.  
 
పెంగ్విన్ తమిళ టీజర్ ను త్రిష విడుదలచేయనుండగా తెలుగు టీజర్ ను సమంత , మలయాళ టీజర్ ను మంజు వారియర్ , ఇంగ్లీష్ టీజర్ ను తాప్సి లాంఛ్ చేస్తారని కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించాడు. ఇక ప్రస్తుతం కీర్తి తెలుగులో మిస్ ఇండియా మరియు గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తుంది. మిస్ ఇండియా ను నరేంద్ర డైరెక్ట్ చేస్తుండగా గుడ్ లఖ్ సఖి ని ఇక్బాల్ ఫేమ్ నగేష్ కుకునూరు తెరకెక్కిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: