తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో. అతను ఆరడుగుల అందగాడు. ఆ హైట్ కి తగ్గ వెయిట్. పర్సనాలిటీకి తగ్గ వాయిస్ ఇవన్నీ కలిసి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్ ని కోట్లాది మంది అభిమానించే రెబల్ స్టార్ని చేశాయి.

 

రెబల్ స్టార్  కృష్ణంరాజు నటవారసుడుగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

 

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్ హిట్‌ మూవీ వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ కి అమ్మాయిలలో క్రెజ్ పెరిగిపోయింది. కానీ ఈ జనరేషన్‌ లో సూపర్‌ హిట్ అయిన వాన పాట వర్షం సినిమాలోది. ఒక్క పాట లోనే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడంతో పాటు విలన్‌ ఇంట్రడక్షన్‌ కూడా అదే పాటలో ప్లాన్ చేశాడు దర్శకుడు. 

 

ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ స్వరాలందించగా.. చిత్ర, రకీబ్‌ అలం, కల్పనలు ఆలపించారు. ఈ సినిమాతోనే ప్రభాస్ కి ఒక్క స్టార్ డాం ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మల్లి వెను తిరిగి చూసుకోలేదు. తాజాగా వచ్చిన బాహుబలి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన హీరో ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: