తెలుగు యూత్ మొత్తం మాట్లాడుకునే ఏకైక పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేసే వాడే హీరో అన్న పవన్ డైలాగు యువతకు బాగా కనెక్ట్ అవ్వడంతో అందరి అయన దూకుడుకు ఫిదా అయ్యారు.  పవన్ ఎం చేసిన కూడా యూత్ బ్రాండ్ ఐకాన్ అని చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పవన్ ను ఫాలో అవుతారు.

 

 

 

విషయాని కొస్తే.. పవన్ లాగే ముక్కుసూటి గా మాట్లాడే వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వ్యక్తి కూడా ఉన్నారు అని అందరు అంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారుగా.. విజయ్ దేవరకొండ.. ఈ హీరో కూడా అంతే తన మాట తనదే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో దూసుపోతున్న ఈ యువ హీరో పవన్ కళ్యాణ్ కు సీక్వెల్ అంటున్నారు. వీరిద్దరిరి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని మనం సపరేటుగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 


పవన్ తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాడు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ కు క్రేజ్ కూడా ఎక్కువే.. తన యాటిట్యూడ్ తో యువతను తన వైపు లాక్కున్నాడు.. అంతేకాదు యూత్ ఐకాన్ గా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలలో క్రేజ్ తెచ్చుకున్న సినిమా అంటే టక్కున గుర్తుకు వచ్చే సినిమా గబ్బర్ సింగ్..రొమాంటిక్, యాక్షన్ కింగ్ గా నటించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో అన్నీ కోణాలను ప్రేక్షకులకు చూపించాడు.దాంతో ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని ఫుల్ కలెక్షన్స్ రాబట్టింది.. మొత్తానికి పవన్ సినీ కెరియర్ లో ఈ సినిమా మైలు రాయి గా నిలచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: