తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. యువ హీరోలు స్టార్ హీరోలు సీనియర్ హీరోలు ఇలా చాలామంది ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచే సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పాలి. అయితే కొన్ని సినిమాలు కేవలం హీరో కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తే కొన్ని మాత్రం ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా బాహుబలి.ఈ  సినిమా కేవలం ప్రభాస్ కెరీర్ లోనో, టాలీవుడ్ ఇండస్ట్రీలోనో ఫ్రెండ్ సెట్టర్గా నిలిచింది  కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని  ఎల్లలు దాటేల చేసింది ఈ  సినిమా.  తెలుగు చిత్ర పరిశ్రమ గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా... విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన నటుడు రాణా విలన్ పాత్రలో నటించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలన విజయాన్ని  నమోదు చేసేందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి 1 బాహుబలి 2 సినిమాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించాయి . భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా సాధ్యం కాని రీతిలో వసూళ్లను రాబట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని  పెంచడంతో పాటు.. ప్రభాస్ ని నేషనల్ హీరో గా మార్చేసింది ఈ  సినిమా. 

 


 అటు రానాకి నటనకు ప్రతిరూపం గా ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. రాజమౌళి కి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి తెరకెక్కించే  సినిమా కోసం ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే అభిమానులు కూడా పెరిగిపోయారు బాహుబలి సినిమా తర్వాత. అంతటి ఘన విజయాన్ని సాధించి భారి వసూళ్లను రాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమ అనే పుస్తకంలో ఒక ప్రత్యేకమైన పేజీని లెక్కించుకుంది  బాహుబలి సినిమా. కేవలం హీరో కెరియర్ కి ట్రెండ్ సెట్టర్  సినిమా కాదు భారతీయ చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని  పెంచినటువంటి ట్రెండ్ సెట్టర్  సినిమా అని గర్వంగా చెప్పుకునేలా చేసింది . అందుకే తెలుగు ప్రజలందరూ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: