ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు మెగాపవర్ స్టార్  రామ్ చరణ్. ప్రతి విషయంలో తనదైన టాలెంట్ ను నిరూపిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరో గా మారిపోతున్నాడు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే చిరుత సినిమా తో రామ్ చరణ్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత రెండవ సినిమాతోనే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రేంజ్ ను సంపాదించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రెండవ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త ట్రెండ్ సృష్టించింది. రామ్ చరణ్ కెరీర్ ని కీలక మలుపు తిప్పింది. 

 


 ఆ సినిమా ఏదో కాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా. మగధీర సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ట్రెండ్ సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలుగానే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సాదాసీదా హీరోలను స్టార్ హీరో గా మార్చారు రాజమౌళి. ఇక అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను  కూడా సార్ హీరో గా మార్చేసారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. 

 


 డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది అనే చెప్పాలి. ఇక  వసూళ్ళ పరంగా కూడా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది మగధీర సినిమా. రామ్ చరణ్ కెరీర్ ని కీలక మలుపు తిప్పి రెండవ సినిమా కే రామ్ చరణ్ ను  స్టార్ హీరోగా మార్చేసింది సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను కూడా సెట్ చేసింది ఈ సినిమా. ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు మగధీర సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగులు ఇప్పటికికూడా తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: