పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రేక్షకుల్లో  అంతకంతకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ఏ హీరోకు లేనంత మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మొన్నటి వరకు రాజకీయాలలోనే కొనసాగిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాపై కూడా టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా పరిచయమైన విషయం తెలిసిందే. 

 

 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఇక ఆ సినిమా తర్వాత తొలి ప్రేమ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. పవన్ కళ్యాణ్ మేనరిజం కి అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఖుషి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ ని కీలక మలుపు తిప్పింది అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించి పవన్ కళ్యాణ్ ని  స్టార్ హీరో రేంజ్ కు ఎదిగేలా చేసింది ఖుషి సినిమా. 

 


 ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య ఉండే కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ఇక భూమిక పవన్ కళ్యాణ్ మధ్య సంభాషణలు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాయి  చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో తనదైన మేనరిజంతో... అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు అనే చెప్పాలి.ఇక ఈ సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే  ఉంటాయి. ఖుషి సినిమా ఇప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఉంటుంది. ఇప్పటికికూడా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఫేవరెట్ గానే ఉంది. కాగా అప్పట్లో సంచలన విజయం సాధించిన ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కీలక మలుపు తిప్పి స్టార్ హీరోగా మార్చేసింది .

మరింత సమాచారం తెలుసుకోండి: