టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చి  కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా హీరో కెరీర్ ని మలుపు తిప్పుతూ  ఉంటాయి కొన్ని సినిమాలు. హీరో కెరీర్ ని మలుపు తిప్పటమే  కాదు టాలీవుడ్ లో కూడా కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంటాయి. ఇలా 90లలో తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన ఒక సినిమా కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి హీరోకి స్టార్డం  తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఏదో కాదు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ. శివ సినిమా గురించి నాటితరం ప్రేక్షకులతో పాటు నేటి తరం ప్రేక్షకుల్లో కూడా తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో అప్పటివరకు సాదాసీదా హీరోగా ఉన్న నాగార్జున స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక పేజీ లికించుకున్నారు.  అక్కినేని నాగేశ్వరరావు వారసుడు గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు నాగార్జున. ఇక అయిదు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికీ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. అయితే స్టార్ హీరోల వారసుడిగా వచ్చినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఒక మంచి బ్రేక్ ఇచ్చే  సినిమా రావాలి అనే విషయం తెలుస్తుంది. ఇలా నాగార్జున కెరియర్ మొదట్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా శివ. అప్పట్లో డైరెక్టర్గా ఎంతగానో క్రేజ్ ఉన్న  రాంగోపాల్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రతి సన్నివేశం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. 

 


 అప్పుడు వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త యాక్షన్ సన్నివేశాలు శివ సినిమాలో కనిపించాయి. ముఖ్యంగా సైకిల్ చైన్ లాగడం అయితే ఈ సినిమాలో మరింత ఫేమస్ అయిపోయింది. సైకిల్ చైన్ లాగి  విలన్ ను చితకబాదేసిన సన్నివేశం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇలా ఈ సినిమాలోని ప్రతి ఒకటి నాగార్జున కెరియర్ కి స్టార్ హీరోగా మార్చడమే  కాదు టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. అటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. శివ సినిమా తర్వాత నాగార్జున మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోలేదు అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా టాలీవుడ్ మన్మథుడు గా కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: