ఆయన తొడగొడితే రికార్డులు మీసం తిప్పితే అవార్డులు అని సినీ విమర్శకులు అనేలా బాలకృష్ణ సినిమాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. తెలుగు సినీ పరిశ్రమలో సమరసింహా రెడ్డి, నరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించి తెలుగు ప్రజలలో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తూ సూపర్ ఫిట్నెస్ తో దూసుకెళ్తున్నాడు. జూన్ పదవ తేదీన తాను 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 


తండ్రి ఎన్టీ రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మకల చిత్రం లో బాలకృష్ణ తొలిసారిగా సినీ ఇండస్ట్రీలో అడుగు మోపాడు. అప్పటికి తన వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. బాలకృష్ణ తన చిన్నతనమంతా హైదరాబాద్ నగరంలోనే గడిపాడు. అతని విద్యాభ్యాసం హైదరాబాద్ నగరంలో పూర్తి అవ్వగా... నిజాం కాలేజీలో తాను డిగ్రీ పూర్తి చేశాడు. నిజానికి బాలకృష్ణ ఇంటర్ పూర్తి చేసిన వెనువెంటనే సినిమా రంగంలో శాశ్వతంగా అడుగుపెట్టాలని అనుకున్నాడు కానీ తన తండ్రి కనీసం డిగ్రీ చదువు అయినా ఉండాలని చెప్పగా తాను బి.ఏ పూర్తి చేశాడు. 

 


బాలకృష్ణ తన సినీ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా సహాయనటుడిగా నటించాడు. ఆ సినిమాలన్నీ ఎన్టీఆర్ నటించినవి, దర్శకత్వం వహించినవే. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చే ముందు... తాతమ్మకల( బాలకృష్ణ పాత్రలో), దానవీరశూరకర్ణ( అభిమన్యుడు పాత్రలో), అక్బర్ సలీం అనార్కలి(సలీం పాత్రలో), శ్రీ మద్విరాట్ పర్వం( అభిమన్యు పాత్రలో), శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం(నారదుడు పాత్రలో) చిత్రాలలో నటించాడు. శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో మొట్టమొదటిగా కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

సాహసమే జీవితం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ చిత్రం జూన్ 1, 1984 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ తన సినీ కెరీర్ లో దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తో కలసి 11 సినిమాలు, కోడి రామకృష్ణ తో ఏడు సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాలు తీసాడు. 1987వ సంవత్సరంలో బాలకృష్ణ ఏకంగా 8 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించాడు. వాటిలో సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు భానుమతిగారి మొగుడు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: