ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తుంది. యువ హీరోల సినిమాలకు ఫస్ట్ ఆప్షన్ అవుతున్న ఈ అమ్మడు తన  వస్తున్న రూమర్స్ కు షాక్ అయ్యింది. ఓ యువ హీరోతో రాశి ఖన్నా ప్రేమలో పడినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి అటు చేరి ఇటు చేరి రాశి ఖన్నా దాకా వెళ్లడంతో మీడియాలో వస్తున్న ఈ వార్తలపై ఫైర్ అయ్యింది అమ్మడు. 

 

తను ప్రేమలో పడినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అసలు తనకు ప్రస్తుతం ప్రేమించడానికి టైం లేదని ఆ టైం వచ్చినప్పుడు ఆలోచిస్తానే తప్ప ముందు కాబోయే వాడి గురించి అలా ఉండాలి ఇలా ఉండాలి అనే కండిషన్స్ ఏమి పెట్టుకోలేదని అంటుంది రాశి ఖన్నా. తన పూర్తి కాన్సెన్ట్రేషన్ నటన మీద.. మంచి సినిమాలు చేయాలనే ఉందని ఇప్పుడప్పుడే ఎలాంటి రిలేషన్ పెట్టుకునే ఆలోచన లేదని ఖరాకండిగా చెప్పేసింది రాశి ఖన్నా. అంతేకాదు తనకు ఎవరెవరితోనో లింక్ పెట్టి వార్తలు రాయడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తపరచింది రాశి ఖన్నా. 

 

తెలుగులో యువ హీరోల సరసన నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాశి ఖన్నా తమిళ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇయర్ తెలుగులో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నిరాశపరచాగా రెండు మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. తమిళంలో మాత్రం ఆల్రెడీ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో సినిమా కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా తెలుగులో స్టార్ ఛాన్సులను మాత్రం అందుకోవడంలో వెనుకపడ్డది.           

 

మరింత సమాచారం తెలుసుకోండి: