ప్రతిష్టాత్మకంగా భారీ తారాగణంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదాల మీద వాయిదా పడుతుంది. కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ నిలిపివేయడం, సినిమాలు నెలలపాటు వాయిదా పడడం జరిగిపోయాయి. ప్రస్తుతానికి సినీ చిత్రీకరణలను పునః ప్రారంభించడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటీమణి శ్రియ శరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి కొన్ని విషయాలను లీక్ చేసింది.


ఆమె సోషల్ మీడియా వేదికగా ఏం చెప్పిందంటే... దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నేను నటిస్తున్నాను. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ స్టోరీ లో అజయ్ దేవగన్ సరసన నేను కనిపిస్తాను. ఈ చిత్రంలో చాలా ఫీల్ గుడ్ సన్నివేశాలు ఉంటాయి', అని ఆర్ఆర్ఆర్ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి కాస్త లీక్ చేసింది శ్రియా శరణ్. 


ఆమె ఇంకా మాట్లాడుతూ... గతంతో పోల్చుకుంటే ఎన్టీఆర్ చాలా మారిపోయాడు. ఇప్పుడు చూడటానికి భలే అందంగా ఉన్నాడు. ఆయనలో ఎనర్జీ హై లెవెల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనతో షూటింగ్ లో పాల్గొంటే ఆ మజానే వేరు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటూ ఫన్ సృష్టిస్తాడు' అని ఆమె చెప్పుకొచ్చింది. 


తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ... నేను రెండు హిందీ చిత్రాల్లో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలో తడ్కా, సర్కార్ చిత్రాల్లో నటిస్తున్నాను. తమిళంలో అరవిందస్వామి సరసన ఒక సినిమాలో, మరొక కామెడీ చిత్రంలో నటిస్తున్నాను. ప్రస్తుతానికి నేను నా భర్తతో కలిసి స్పెయిన్ దేశంలో సమయాన్ని గడుపుతున్నాను. విమాన రాకపోకలు ప్రారంభం అవ్వగానే ఇండియాకి తిరిగి వచ్చేస్తాను, షూటింగ్ లలో పాల్గొంటాను', అని శ్రియా శరణ్ చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియాభట్ బొలీవియా పాత్రలు ఈ విధంగా ఉండబోతున్నాయని ఒక లీక్ నెట్టింట హల్ చల్ చేసింది. ఏదేమైనా సినిమా చూసి ఆనంద పడాల్సిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం లీక్స్ తో సంతృప్తి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: