సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో హీరోల‌కు, హీరోయిన్ల‌కు, ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు త‌మ కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తిండిపోయే సినిమా అంటూ ఖ‌చ్చితంగా ఒక‌టి ఉంటుంది. ఆ సినిమా ట్రెండ్ సెట్ చేయ‌డ‌మే కాదు.. వారి కెరీర్‌ను కూడా ట‌ర్న్ చేస్తుంది. అయితే మంచు విష్ణు కెరీర్లో అలాంటి చిత్రమే `ఢీ`‌. శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై మంచి సక్సెస్ ని సాధించింది. మల్లిడి సత్యనారాయణరెడ్డి నిమ్మించిన ఈ చిత్రానికి కోన వెంకట్ మ‌రియు గోపీమోహన్ రచయితలుగా వ్య‌వ‌హ‌రించారు.

 

అలాగే ఈ చిత్రంలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు. అయితే వాస్త‌వానికి ఈ సినిమాకు ముందు విష్ణు  అంత ఫామ్ లో లేడు. శీను వైట్ల అంత‌కు ముందు తీసిన  వెంకీ ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఏర్ప‌డ‌లేదు. కానీ, 2007లో విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య‌మైన మౌత్ టాక్ తో ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించింది. ఇక శీను వైట్ల‌, కోన వెంక‌ట్, గోపి మోహ‌న్ ల ద‌శ తిరిగిపోయింది. 

 

ముఖ్యంగా దుబాయి శ్రీను, రెడీ , బాద్ షా, దూకుడు లాంటి మంచి హిట్స్ అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్ గా ఎదిగాడు శీను వైట్ల. బ్ర‌హ్మానందం కు కొత్త ఊపు వ‌చ్చింది. బొమ్మ‌రిల్లు త‌ర్వాత జెనీలియాకు ఢీ ఒక సూప‌ర్ హిట్ గా నిలిచింది. విష్ణు కెరీర్ ఢీ కి ముందు ఢీ త‌ర్వాత ఆ స్థాయి హిట్ లేదు. హీరోయిన్ ఇంట్లో హీరో చేరి బ‌క‌రాల‌ను అడ్డం పెట్టుకుని హంగామా చేసే స‌రికొత్త ఫార్ములా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ చేసింది.  ఢీ హిట్ అయిన త‌ర్వాత ఆ ట్రెండ్ మ‌రో యాబై సినిమాల వ‌ర‌కూ వ‌చ్చి ఉంటాయి. దాదాపు ప‌దేళ్లు ఢీ ట్రెండ్ లో వ‌చ్చిన సినిమాల హ‌వా కొన‌సాగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: