బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతనికి మంచి క్రేజ్ వచ్చింది ఆ సినిమా తో. ఆ సినిమా తర్వాత అతను మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని తీసుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఇప్పుడు రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అతని అభిమానులు. 

 

ప్రస్తుతం ప్రభాస్సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది చివర్లో ఒక సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు... ప్రభాస్ ఫాన్స్ లో కాస్త చికాకు మాత్రం బాగా ఉంది అని అంటున్నారు. ప్రభాస్ ఫాన్స్ అతని సినిమాల కోసం ఎంత ఎదురు చూస్తుంటే అవి ఎంత ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ఇతర హీరోల సినిమాలు వెంటనే విడుదల అవుతున్నాయి. మహేష్ బాబు లాంటి హీరో కూడా ఏడాదికి ఒక సినిమాను విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 

 

ప్రభాస్ మాత్రం రెండేళ్లకు ఒక సినిమాను విడుదల చేయడం కూడా కష్టం అయింది. ప్రభాస్ సినిమా విడుదల అయితే అది హిట్ అవుతుందా లేదా అనేది చెప్పడం కాస్త కష్టమే. ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత వస్తున్న సినిమా కూడా హిట్ అవుతుందా లేదా అని చెప్పలేని పరిస్థితి. ఇది క్రమంగా అసహనం వ్యక్తమవుతుంది. ఎన్ని రోజులు ఎదురు చూడాలి అంటూ ఆగ్రహంగా ఉన్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: