ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఫాన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఎప్పుడు  విడుదల అవుతుంది అనేది ఎవరికి అర్ధం కాని పరిస్తితితి. సినిమాను ఎప్పటి నుంచో విడుదల చేస్తారు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి గాని సినిమా ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చెప్పడం దాదాపుగా సాధ్యం కావడం లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. సినిమాను కాస్త లేట్ చేసే సూచనలే ఉన్నాయి అని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. సినిమా విడుదల కచ్చితంగా వాయిదా పడుతుంది అని నిర్మాత కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిజంగానే ఈ సినిమా అందరూ అనుకున్న విధంగానే వాయిదా పడుతూ వస్తుంది. 

 

సినిమా తర్వాత తారక్సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయకపోతే మాత్రం ఇక ఫాన్స్ రాజమౌళి మీద దాడి చేస్తారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేస్తున్నారు. మరి సినిమా ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్సినిమా చేసే అవకాశం ఉంది అనేది కూడా స్పష్టత రావడం లేదు. అతను రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు అనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: