తెలుగు సినిమాకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని అంటారు. తెలుగు సినిమాను దశాబ్దాల పాటు అప్రతిహతంగా ఏలేశారు ఇద్దరూ. తెలుగు సినిమా ప్రత్యేకత చాటింది కూడా ఈ ఇద్దరే. పోటాపోటీగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ పౌరాణికంలో రాణిస్తే.. సాంఘీకంలో ఏఎన్నార్ రాణించారు. ఇప్పుడు చెప్తున్న మల్టీస్టారర్ కాన్సెప్ట్ ను ఇద్దరూ వారి కెరీర్ తొలినాళ్ల నుంచే చేశారు. మిస్సమ్మ నుంచి ఎన్నో సినిమాలు కలిసి చేశారు. స్టార్ డమ్ పెరిగాక కూడా కలిసి సినిమాలు చేశారు. అలా చేసిన సినిమాల్లో ‘రామకృష్ణులు’ కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై నేటికి 42 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఎన్టీఆర్, ఏఎన్నార్ సూపర్ స్టార్ డమ్ బేస్ తో తెరకెక్కిన ఈ సినిమా 1978 జూన్ 8న విడుదలైంది. వారిద్దరిపై ఉన్న క్రేజ్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. హీరోయిన్లుగా జయసుధ, జయప్రద నటించారు. కేవీ మహదేవన్ సంగీతంలోని పాటలు అలరించాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. 7కేంద్రాల్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. వీబీ రాజేంద్రప్రసాద్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి ఈ సినిమా తీశారు. అయితే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ పోటాపోటీగా నటిస్తారని భావించిన అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది.

IHG

 

ఇదే విషయమై నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్, ఏఎన్నార్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. పోటాపోటీగా వస్తున్న వీరి సినిమాలపై అప్పట్లో అభిమానుల మధ్య బహిరంగ చర్చలు ఉండేవి. అభిమానుల మధ్య సహృద్భావ వాతావరణం కల్పించాలని ఇలా వారిద్దరితో కలసి సినిమా చేయాలని నిర్ణయించాం. ఇందుకు హీరోలు కూడా అంగీకరించడంతో రామకృష్ణులు తీశాం’ అని నిర్మాత వీబి రాజేంద్రప్రసాద్ అన్నారు.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: