నందమూరి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలతో మాస్ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ ఉంటారు బాలకృష్ణ. దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా  కొనసాగుతున్నారు బాలకృష్ణ. తన సినీ ప్రస్థానంలో ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అద్భుతాలను సృష్టించారు. ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో డిఫరెంట్ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 


 అయితే బాలకృష్ణ ఇప్పుడు వరకు తన కెరియర్ లో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లోనే తొలి సైన్స్ ఫిక్షన్ సినిమాలో  కూడా బాలకృష్ణ నటించారు. ఆదిత్య 369 సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత ఘన విజయం సాధించి... ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుత జనరేషన్ నుంచి రాయలవారి జనరేషన్ కి వెళ్లి అక్కడ బాలకృష్ణ చేసే సాహసాలు అందరిని అబ్బుర పరుస్తుంది. అప్పట్లోనే టైం మెషిన్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ సినిమాలను దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెండి తెరపై ఆవిష్కరించే... సినీ ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకునే ఘన విజయాన్ని సాధించారు. 

 

 ఇక ఆ తర్వాత బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల జోలికి మాత్రం పోలేదు. అయితే మూడు దశాబ్దాల కింద వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. ఆదిత్య 999... అనే టైటిల్తో ఈ సీక్వెల్ చేయాలని బాలకృష్ణ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తయిందని... దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకొన్ని రోజుల్లో ఉంది అధికారికంగా చిత్ర బృందం ప్రకటిస్తారు అనే టాక్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: