రవిబాబు కెరీర్‌ తొలినాళ్ళల్లో నటుడిగా అలరించారు. సినిమాలలో విలక్షణ నటుడిగా అలచింరించిన రవిబాబు అనంతరం డైరెక్టర్ ఫీల్డ్ లోకి వెళ్ళాడు. నెమ్మదిగా సినిమాలు తీయడం ప్రారంభించారు. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు దిట్ట. 

 

సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు అని చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ రూట్‌లో వెళ్తూ పలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ పరిచయం చేసిన ఆయన.. ఇటీవలే 'ఆవిరి' సినిమాతో అలరించారు. ఇక ఇప్పుడు 'క్రష్' అంటూ మరో సినిమా రెడీ చేస్తున్నారు.

 

హారర్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా రూపొందించే రవిబాబు ఈ సారి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'క్రష్' అంటూ యూత్‌కి కనెక్ట్ అయ్యే టైటిల్ చూజ్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా అన్‌లాక్ 1.0 అని పేర్కొంటూ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు రవిబాబు. రవిబాబు స్టైల్ లోనే ఈ పోస్టర్ వినూత్నంగా ఉండటమే గాక యువతను ఇట్టే ఆకర్షిస్తోంది.

 

బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను ఈ పోస్టర్‌లో చూపించడం ఆసక్తికరంగా ఉంది. ముగ్గురు అబ్బాయిలు మాస్క్‌లు ధరించి బాత్‌రూంలో ఉన్న  అమ్మాయిని గమనిస్తుండడం ఆసక్తిని కలిగిస్తుంది.

 

ఈ పోస్టర్‌పై ''జాగ్రత్తగా బయట పడండి'' అని పేర్కొనడం యువతరానికి స్పెషల్ కిక్కిస్తోంది. 'మాస్క్ పెట్టుకోండి సేఫ్‌గా ఉండండి' అని పేర్కొంటూ ప్రస్తుత పరిణామాలను ఇంక్లూడ్ చేసి ఈ పోస్టర్ వదిలారు రవిబాబు. దీంతో ప్రస్తుతం ఈ 'క్రష్' పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన రవిబాబు సినిమాతో థ్రిల్‌ చేస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: