సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ సినిమా టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైంది. తప్పిపోయిన కొడుకు కోసం కన్న తల్లి పడే బాధ ఎలావుంటుందో టీజర్ లో చూపించారు. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. తల్లి పాత్రలో కీర్తి నటించింది. మహానటి తరువాత తన నట విశ్వ రూపాన్ని ఈ సినిమా ద్వారా కీర్తి మరో సారి చూపెట్టనుంది. మొత్తానికి ఈటీజర్, సినిమాపై అంచనాలను పెంచింది. ఈనెల 11న ట్రైలర్ కూడా విడుదలకానుంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మళయాలంలోకి కూడా డబ్ అయ్యింది. అన్ని భాషల్లో ఒకేసారి థియేట్రికల్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.
లీడింగ్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ,పెంగ్విన్ హక్కులను దక్కించుకుంది. ఈనెల 19న ప్రైమ్ ఈచిత్రాన్ని స్ట్రీమింగ్ లో ఉంచనుంది. ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా సంతోష్ నారాయనన్ సంగీతం అందించాడు. ఇదిలావుంటే  ప్రస్తుతం కీర్తి సురేష్ మూడు సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి రజినీకాంత్  అన్నాథే కాగా మరో రెండు  మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఈరెండు సినిమాలు  కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. 

మరింత సమాచారం తెలుసుకోండి: