ధ్రువ సినిమా నుంచి కూడా మెగా హీరో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు వస్తుంది అని అతని అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత అతను రంగస్థలం సినిమాను చాలా గ్యాప్ తీసుకుని చేసాడు. రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల షూటింగ్ మినహా దాదాపుగా షూటింగ్ అంతా కూడా అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతను చేసే తర్వాత సినిమా విషయంలో అందరికి పెద్ద ఎత్తున ఆసక్తి ఉంది. 

 

రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అతను ఒక మహిళ జీవిత కథ ఆధారంగా సినిమాను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. మహిళ మీద జరిగిన ఒక అన్యాయం కి ఆమె కు అండగా నిలబడిన ఒక చిన్న పోలీసు అధికారి జీవిత కథ ఆధారంగా సినిమాను తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి అని  అంటున్నారు. అతను ఆ సినిమా కథకు సంబంధించి ఒక ప్రముఖ రచయిత తో చర్చించాడు అని వార్తలు వస్తున్నాయి. కథను దాదాపుగా సిద్దం చేసినట్టు తెలుస్తుంది. 

 

చిన్నారి తండ్రి చనిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది  అని ఆమెకు ఆస్తి ఉంటుంది అని ఆ తర్వాత ఆమెకు అండగా నిలిచే ఒక పోలీస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ పూర్తి కాక ముందే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అసలు ఇదే సినిమానా లేక ఇంకా ఏదైనా కథ ఉందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: