మెగా హీరోల సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో ఇప్పుడు ఆసక్తి ఉంది అనేది వాస్తవం. వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. చిరంజీవి నుంచి నిన్నా మొన్నా వచ్చిన హీరోల వరకు కూడా ఇదే రేంజ్ లో ఆసక్తి ఉంది. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అగ్ర హీరోల సినిమాల కోసం అయితే అభిమానులు ఏ స్తాయిలో ఎదురు చూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అల్లు అర్జున్ పుష్ప చిరంజీవి ఆచార్య, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలు చేస్తున్నారు 

 

ఈ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ ఒక భారీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒక పెద్ద సినిమాను ఈ నలుగురు చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనికి సంబంధించిన చర్చలు మాత్రం ఇటీవల అల్లు అర్జున్ అల్లు అరవింద్ మధ్య వచ్చాయి అని అంటున్నారు. చిరంజీవి కూడా దీనికి ఓకే చెప్పారు అని సమాచారం. ఈ సినిమాను అల్లు అరవింద్ తో పాటుగా రామ్ చరణ్ కలిసి నిర్మించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది చూడాలి. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమాలో ఒక యువ హీరో ని కూడా చూపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: