మొత్తానికి టాలీవుడ్ లో మేకర్స్ కి మంచి వార్త వచ్చింది. కరోనా నిబంధనలతో త్వరలో షూటింగ్స్ కి పర్మిషన్ వచ్చి అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరో వారం పది రోజుల్లో టీవీ సీరియల్స్..సినిమాలు షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు షూటింగ్స్ కంప్లీటయిన సినిమాలు చక చకా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకోవచ్చు. దీన్ని బట్టి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోతాయి. ఇంతవరకు బాగానే ఉంది. 

 

అయితే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న సినిమాల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు గందరగోళంగా మారింది. ఇప్పట్లో థియోటర్స్ ఓపెన్ అయ్యో అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రజల ప్రాణాలను దృష్ఠిలో పెట్టుకొని కఠినంగానే వ్యవహరిస్తుంది. కాని ఇందుకు ప్రత్యామ్నయంగా మాత్రం మార్గం దొరకడం లేదు. రిలీజ్ కి రెడీ అయిన సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే చాలా సమస్యలు చుట్టు ముడతాయి.

 

కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన పెంగ్విన్ లాంటి సినిమాలకి ఓటీటీ ప్లాట్ ఫాంస్ కరెక్టే కాని స్టార్స్ నటించిన సినిమాలకు మాత్రం ఈ ఓటీటీ విధానం కరెక్ట్ కాదన్న మాటే గట్టిగా వినిపిస్తుంది. వ్యాపారపరంగా చూస్తే భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఏమీ లాభం ఉండదని అంటున్నారు మేకర్స్.

 

మరి అలా థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలంటే సినిమాలని ల్యాబ్ లో పెట్టుకొని ఎన్నాళ్ళు ఆగాలో అర్థం కావటం లేదు నిర్మాతలకి. ఈలోపు అప్పులు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. మరి ఇందుకు మార్గం ఏంటన్నది ఇప్పుడు ప్రతీ నిర్మాతకి మిలియన్ డాలర్ ప్రశ్న గా మారింది. నిజంగా ఓటీటీ వల్ల నిర్మాతలకి మంచి లాభాలు వస్తాయనుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయడానికి నాని వి, అనుష్క నిశబ్ధం, రాం రెడ్, రవితేజ క్రాక్ ...ఇలా చాలా సినిమాలున్నాయి. కాని నిర్మాతలు చాలా విషయాలు దృష్ఠిలో పెట్టుకొని ముందడుగు వేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: