ఈనెల10న నటసింహం బాలకృష్ణ తన 60వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈసందర్భంగా ఫ్యాన్స్ కోసం పలు సప్రైజ్ లు రెడీ గా వున్నాయి. అందులో భాగంగా రేపు సాయంత్రం 5:03 గంటలకు కరోనా పై బాలకృష్ణ పాడిన స్పెషల్ సాంగ్  విడుదలకానుంది. ఓ లేడీ సింగర్ తో కలిసి బాలయ్య ఈ సాంగ్ పాడారు. ఇది కాకుండా  బాలయ్య ను పొగుడుతూ ప్రముఖ గాయకుడు సింహ తన బృందంతో  పాడిన పాట బాలయ్య బర్త్ డే రోజు విడుదలకానుంది. జై బాలయ్య .. జై జై బాలయ్య అంటూ సాగే ఈ పాట లో బాలయ్య పై వచ్చిన మీమ్ పదాలు కూడా ఉంటాయట. అయితే ఈ సప్రైజ్ లు పక్కన పక్కన పెడితే అభిమానులకు కావాల్సిన అసలైన గిఫ్ట్ కూడా సిద్ధంగా వుంది. 
 
బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తన 106 వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి బుధవారం నాడు ఓ చిన్న టీజర్ విడుదలకానుంది. దీనికి సంబందించిన అప్డేట్ ను రేపు రివీల్ చేయనున్నారు. ఇంతకుముందు బోయపాటి- బాలయ్య కాంబో లో వచ్చిన సింహ ,లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో ఈమూడో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
 
ఇక ఈచిత్రానికి టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి మోనార్క్ అనే టైటిల్ ను పెట్టనున్నారట. ఈ చిత్రంలో బాలకృష్ణ ,అఘోరా గెటప్ లోకూడా కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్ ను తీసుకోనున్నారు. ఈఏడాది  చివర్లో ఈ సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: