మన తెలుగు అమ్మాయి.. భాను ప్రియా. రాజమండ్రిలో తను పుట్టింది. అయితే తన పేరు మంగ భామ.. ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఇంకా స్వర్ణకాలం సినిమాలో ఆమె నటన చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. ఆ సినిమాలో అంత అద్భుతంగా ఉంది తన నటన. ఇంకా అలాంటి భాను ప్రియా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఇప్పుడు కొన్ని సినిమాల్లో అక్కగా, మరికొన్ని సినిమాల్లో అమ్మగా, మరికొన్ని అత్తగా నటిస్తూ వస్తుంది. 

 

IHG

 

అయితే.. తను ఎంచుకునే ప్రతి పాత్రలో నటించడం కాదు జీవించేస్తుంది. గౌతమ్ ఎస్ఎస్సి లో అయితే అక్క పాత్రలో జీవించేసింది. పిల్లలు లేరు అనే ఫీల్ గురించి మాట్లాడటం.. అల్లరి చేసే తమ్ముడును వెనకేసుకురావడం.. ఇలా అన్ని కూడా సూపర్. అలాంటి భాను ప్రియా అదే సంవత్సరంలో ఛత్రపతి సినిమాలో అమ్మ పాత్ర నటించింది. ఎంత వెరియేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంత కూడా తల్లి గురించే. 

 

IHG

 

అప్పట్లో హీరోయిన్ ఇండస్ట్రీని ఎలినా భామలు అందరూ కూడా ఇప్పుడు అమ్మ పాత్రల్లో అదరగొట్టేస్తున్నారు. అలానే ఈ భాను ప్రియా కూడా. ఇంకా వెంకటేష్, నాగార్జున, చిరంజీవి పక్కన హీరోయిన్ గా విలన్ గా నటించిన ఈ అందాలా భామ ఇప్పుడు వాళ్ళకే అత్తగా, తల్లిగా, అక్కగా నటించింది. ఏది ఏమైనా హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ హీరోలకు ఎవరికీ ఉండదు అనేది నిజం. వాళ్ళు 40 ఏళ్ళు హీరోగానే నటిస్తే వీళ్ళు నలభై ఏళ్లలో కేవలం హీరోలా కాకుండా.. విలన్ గా, అక్కలా, తల్లిలా, అత్తలా ఇలా ఏ పాత్ర కాలిగా ఉంటే ఆ పాత్రలోకి దూరి నటించేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: