ఇండియన్ సినిమాలో సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా లో మొదటి లేడీ సూపర్ స్టార్ సావిత్రి అనే విషయం అందరికి తెలుసు. ఏ హీరోయిన్ కూడా ఇప్పటికి కూడా అందుకోలేని విజయాలను ఆమె తన ఖాతాలో వేసుకుంది. అగ్ర హీరోయిన్ గా తాను ఏంటీ అనేది ప్రపంచానికి సావిత్రి అతి తక్కువ కాలంలో చాలా సమర్ధవంతంగా చూపించింది అనేది అందరికి ఒక అవగాహన ఉంది. ఇక హీరోయిన్ గా అటు తమిళంలో ఇటు తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె కలిసి పని చేసారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సావిత్రి ఉంటే చాలు. 

 

ఇక ఆమె హీరోయిన్ గానే కాదు... ఇతర పాత్రలను కూడా చాలా వరకు సమర్ధవంతంగానే సావిత్రి పోషించారు. ఏ పాత్రలో చేసినా సరే సావిత్రి అనే మార్క్ కచ్చితంగా ఉండేది అని చెప్పవచ్చు. అత్యంత సమర్ధవంతంగా ఆమె నటించారు. ఆమె స్క్రీన్ మీద ఉంటే కొంత మందికి ఒకరకంగా పండగ అని అంటారు. ఆ విధంగా ఆమె తెర మీద తన మార్క్ వేసారు. ఆమె నటన కోసం హాల్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆమె సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా చూసే ప్రేక్షకులు ఆమె ఫ్యాన్ ఉన్నారు. 

 

ఆమె సినిమాలు అనగానే అదో చెప్పని క్రేజ్. ఇక హీరోలకు అక్కగా హీరోయిన్ లకు అమ్మగా ఆమె మంచి  పాత్రలు చేసారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఎదురైన సంఘటనలు మాత్రం ఆమె నిజ జీవితంలో ఎదుర్కోలేకపోయారు అనేది వాస్తవం. అందుకే ఆమె కెరీర్ ఆ విధంగా అయిపొయింది అనే విషయాన్ని  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఎప్పటికి కూడా తెర మీద రియల్ సూపర్ స్టార్ అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: