బాలీవుడ్ లో విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగులో సినిమాలు చేసినా సరే జనాలకు ఒకరకంగా ఇష్టమే. ఆమె స్థాయిలో ఇప్పుడు బాలీవుడ్ లో నటన లో ఆకట్టుకునే హీరోయిన్ ఎవరూ లేరు అనే చెప్పవచ్చు. ఏ పాత్రలో అయినా సరే ఆమె చాలా వరకు సమర్ధవంతంగా నటిస్తారు అని అంటారు దర్శక నిర్మాతలు ఆమె సినిమా చూసిన వాళ్ళు. ఆమె నటనకు ముందు మంచి మార్కులు పడతాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సినిమా ఏది అయినా సరే ఆమె నటన గురించే మాట్లాడే విధంగా ఉంటుంది పరిస్థితి. 

 

ఇక ఆమె ఒక్క హీరోయిన్ గానే కాదు కొన్ని సినిమాల్లో వేరే పాత్రలు కూడా చేసారు. ఆ పాత్రలకు ఆమె తనధైన శైలిలిలో అందం తీసుకొచ్చారు అనే విషయం అందరికి తెలిసిందే. ఆమెకు బాలీవుడ్ లో మంచి ఆఫర్లు రావడమే కాకుండా ఇటు తెలుగులో కూడా ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆమె బాలకృష్ణ కు భార్యగా నటించారు. ఆమె నటనకు ఇక్కడ కూడా మంచి మార్కులు పడ్డాయి. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె జీవించారు అనే పేరు కూడా వచ్చింది. ఆ విధంగా విద్య తన మార్క్ వేసుకున్నారు. 

 

ఒక్క హీరోయిన్ గా గ్లామర్ దుస్తులు వేయడమే కాదు అవసరం అయితే చీర అయినా కట్టి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఆమె పని చేసారు అనేది వాస్తవం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆమె దాదాపుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే మంచి పాత్రలు వస్తే మాత్రం ఆమె కచ్చితంగా సినిమాలు చేస్తున్నారు. ఆమెకు తెలుగులో కూడా దాదాపుగా మంచి పాత్రలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే ఆలోచించి ఓకే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: