మన తెలుగులో చాలా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి... ఆమె సినిమాలు అయినా ఆమె నటన అయినా సరే ఆమె కు ముందు నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ హీరోయిన్ కూడా చేయలేని విధంగా ఆమె సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఏ హీరోయిన్ కి సాధ్యం కాని రికార్డ్ లను ఆమె తన ఖాతాలో చాలా తక్కువ కాలంలో వేసుకున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమె ఉంటే సినిమాకు ఒక రేంజ్ అనే విధంగా ఆమె నటించారు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో ఆమె పాత్ర ఒక హైలెట్. అవును ఏ సినిమాలో చేసినా సరే ఆమె పాత్రకు కచ్చితంగా ఏదోక రూపంలో గుర్తింపు అనేది కచ్చితంగా ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా సరే ఆమె జీవించింది. ఇక అది పక్కన పెడితే  హీరోయిన్ గా చేసిన తర్వాత ఆమెకు హీరోకి అక్కగాన్ విలన్ గా మంచి పాత్రలు వచ్చాయి. అయినా సరే ఆమె మాత్రం చాలా వరకు దూరంగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో చేసే ఛాన్స్ లు ఉన్నా సరే రాజకీయాల వైపు ఆమె ఆసక్తి చూపించి ఆటే వెళ్ళారు గాని ఇటు అవకాశాలు వచ్చినా చేయలేదు. 

 

చాలా రోజుల తర్వాత ఆమె మహేష్ బాబు హీరో గా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆమె నటనకు ఆ సినిమాలో మంచి మార్కులు పడ్డాయి. దాదాపు పదేళ్ళ తర్వాత ఆమె స్క్రీన్ మీదకు వచ్చినా సరే ఏ మాత్రం కూడా తడబడకుండా ఆమె నటించారు అనేది సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధమవుతుంది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: