టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోలతో సినిమా అవకాశాలు కొట్టేసిన హీరోయిన్ కళ్యాణి. ఆమె దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో కూడా చాలా మంచి పాత్రలు పోషించారు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆమె నటన విషయానికి వస్తే ఆమె  చీర కట్టులో చాలా అందంగా నటించారు. ఏ పాత్రలో చేసినా సరే తన మార్క్ ని ఆమె కచ్చితంగా నటన లో చూపించారు అనే చెప్పాలి. ఇక ఆమె సినిమాల్లో ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏ హీరో పక్కన చేసినా సరే ఆ హీరోకి ఆమె భార్యగా సరిపోతుంది అనే విధంగా నటించారు. 

 

వెంకటేష్ తో సినిమా చేసినా జగపతి బాబు తో చేసినా ఎవరి తో చేసినా సరే ఆమెకు ఆ విధంగా మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. అయితే ఆమె ఆ తర్వాత ఎక్కువగా సినిమాల్లో కనపడలేదు. ఇక లెజెండ్ సినిమా తో ఆమె  జగపతి బాబుకి భార్యగా కనిపించారు. ఆ సినిమాలో ఆమె నటన పెద్దగా లేదు గాని జగపతి బాబు కి ఆమె మంచి జోడీ అని ఆమెను తీసుకుంది అప్పుడు చిత్ర యూనిట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాల్లో కనపడటం లేదు. కన్నడ సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి అని అంటారు. మరి అక్కడ ఆమె సినిమాలు చేస్తుందా లేదా అనేది తెలియదు. 

 

ఇక మన తెలుగులో ఆమెకు వెంకటేష్ పక్కన నారప్ప సినిమాలో చేసే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం పెద్దగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె దాదాపుగా సినిమాలకు దూరంగానే ఉంది. అవకాశాలు వచ్చినా సరే చేయడం లేదు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: