తెలుగు సినిమాను రిప్రజెంట్ చేసిన అద్భుతమైన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కానీ.. నటనపరంగా నిబద్ధత పరంగా, ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్లు కొంతమందే ఉంటారు. అలాంటి కేటగిరీలోకి వచ్చే అలనాటి మేటి నటీమణి వాణిశ్రీ. హీరోయిన్ పక్కన చెలికత్తెగా నటించి అటుపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లు ఇండస్ట్రీని ఏలేశారు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. టాప్ హీరోయిన్ గా రాణించిన తర్వాత ఆమె క్యారెక్టర్ నటిగా మారారు. హీరోలకు అత్తగా, హీరోయిన్లకు తల్లిగా.. ఇలా ఒకే సినిమాలో వేరియేషన్లు చూపించి మెప్పించారు వాణిశ్రీ.

IHG

 

అలా ఆమె చేసిన మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ‘అత్తకుయముడు అమ్మాయికి మొగుడు’. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్. టైటిల్ కు తగ్గట్టు సినిమా అంతా చిరంజీవి-వాణిశ్రీ పాత్రలపైనే నడుస్తుంది. పోటాపోటీగా నటించి మెప్పించారు. తర్వాత వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘బొబ్బిలి రాజా’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంలో వాణిశ్రీ పాత్ర కీలకం. ‘రాష్ట్రాన్నైనా రాసిస్తాను కానీ.. నా కూతురినిచ్చి నీకు పెళ్లి చేయను’ అంటూ వాణిశ్రీ చెప్పిన డైలాగ్ పేలిపోయింది. ఇందులో కూడా వెంకటేశ్-వాణిశ్రీ పాత్రలే కీలకం. ఆ తర్వాత నాగార్జునతో ‘అల్లరి అల్లుడు’ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్. ఇది కూడా అత్తా అల్లుళ్ల నేపథ్యమే.

IHG

 

ఈ మూడు సినిమాల్లోనూ టాప్ హీరోలకు అత్తగా నటించారు. ప్రతి సినిమాలో కూడా ఆమె స్థాయికి తగ్గట్టుగానే ప్రాధాన్యమున్న పాత్రలే దక్కాయి. వీటితోపాటు.. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ.. ఆవిడొచ్చింది, రావుగారింట్లో రౌడీ, పెద్దింటల్లుడు, అమ్మనా కోడలా.. ఇలా చాలా సినిమాల్లో హుందా పాత్రలు పోషించి మెప్పించారు. ప్రేక్షకులకు.. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు వాణిశ్రీ అంటే గౌరవం. ఆమె చేసిన పాత్రలు అటువంటివి.

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: