నిన్నటి నుంచి హోటల్స్ మాల్స్ దేవాలయాలు తెరుచుకోవడంతో బయటకు వస్తున్న ప్రజలకు ముంగిట ముప్పు పొంచి ఉంది. అన్నసంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో రికార్డు అవుతున్న కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా నమోదు అయ్యే భారీ కేసుల సంఖ్యతో ఈవారాంతానికి మనదేశం కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో నాల్గవ స్థానానికి చేరిపోతుంది అన్నఅంచనాలు వస్తున్నాయి.

 

ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే అనేక మినహాయింపులు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సినిమా బుల్లితెర షూటింగ్ లకు కూడ అనుమతులు మంజూరు చేసాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ లో కరోనా మరింత చెలరేగి పోతుంది అన్న హెచ్చరికలు ఇస్తున్న పరిస్థితులలో పరిస్థితులు ఇలా దిగజారిపోతే మరొకసారి లాక్ డౌన్ తప్పదా అన్న చర్చలు మొదలయ్యాయి. 

 

దీనితో షూటింగ్ లకు రంగం సిద్ధం అయినా ప్రభుత్వ నియమాలను అనుసరిస్తూ ఎంతవరకు షూటింగ్ లు మొదలవుతాయి అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి జూన్ 15 నుంచి షూటింగ్ లు ప్రారంభించుకునేలా అనుమతులు పొందడం కోసం టాలీవుడ్ పెద్దలు అనేక రాయబారాలు చేసి అనుమతులు వచ్చాక ఇప్పుడు ఇమ్మీడియట్ గా షూటింగ్ లు స్టార్ట్ చేస్తారని నమ్మకం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. 


పెండింగ్ లో వున్న ‘ఆచార్య’  ‘వకీల్ సాబ్’ ‘నారప్ప’ ‘రంగ్ దే’ ‘పుష్ప’ సినిమాలలో ఏ సినిమా కూడ ఈ నెలలో కరోనా భయాలను ఎదిరించి షూటింగ్ మొదలు పెట్టడం కష్టమే అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు అనేకమంది టాప్ హీరోల అభిప్రాయం ప్రకారం అంతా బాగుంటే జూలై లో లేదూ అంటే ఆగస్టులో షూటింగ్ లు పెట్టుకుందాము ఈనెలలో మాత్రం రిస్క్ వద్దు అని సున్నితంగా చెపుతున్నట్లు టాక్. అయితే ఒక్క ‘ఆర్ ఆర్ ఆర్’ మాత్రం ఈనెలలో ఒక ట్రయిల్ షూట్ నిర్వహించి ఎంతవరకు షూట్ చేయగలుగుతాము అన్న పరీక్ష రాజమౌళి తనకు తానుగా పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇండస్ట్రీ పెద్దలు అడిగిన అనుమతులను ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఇచ్చినా ఈనెలలో షూటింగ్ లు ఉంటాయని అనుకోవద్దు అంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈరోజు చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీ పెద్దల టీమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏమి కోరుతుంది అన్నది సస్పెన్స్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: