దగ్గుబాటి వారసుడు రానా డెబ్యూ సినిమా లీడర్. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి సినిమాగా ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆ సినిమా తెర వెనుక జరిగిన కథను రివీల్ చేసి అందరికి షాక్  ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. శేఖర్ కమ్ముల లీడర్ సినిమా కథ వినిపించగా వెంకటేష్ తో ఈ సినిమా తీస్తే బాగుటుంది అని తాను చెప్పాడట కానీ శేఖర్ కమ్ముల మాత్రం ఇది రానాతో చేస్తానని అన్నాడట. 

 

రానా ఓ విఎఫెక్స్ స్టూడియో ఏర్పాటు చేసుకుని ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. హీరో, డైరక్షన్, నిర్మాత వీటిలో ఏది చేస్తావ్ అని అడిగానని దానికి రానా హీరో ఆప్షన్ ఎంచుకున్నాడని అన్నారు సురేష్ బాబు. ఇక లీడర్ కథ రానా కోసమే రాశారా అన్నట్టు ఉంటుంది. సినిమాకు కావాల్సిన హీరో ఫ్రెష్ నెస్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే సినిమాకు మంచి ఆదరణ లభించింది. 

 

ఒకవేళ లీడర్ సినిమా వెంకటేష్  చేస్తే ఎలా ఉండేది.. ఖచ్చితంగా వెంకటేష్ తో కూడా ఇంకా ఎక్కువ రీచ్  అంతేకాదు వెంకటేష్ తో శేఖర్ కమ్ముల సినిమా అనగానే  ఉండేవి కమర్షియల్ గా కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేది. అలా వెంకటేష్ కావాల్సిన లీడర్ సినిమాను రానా చేతుల్లోకి వచ్చి అతని మొదటి సినిమా అయ్యింది. మొదటి సినిమాతోనే ప్రయోగాలు చేయడం మొదలు పెట్టిన రానా హీరోగానే కాకుండా బాహుబలి లాంటి సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. హీరో గా చేయడం గొప్ప విషయం కాదు అంత బ్యాక్ గ్రౌండ్ ఉంచుకుని విలన్ గా చేయడమే గొప్ప విషయం. రానా అరణ్య  రిలీజ్ సిద్ధమవగా.. విరాటపర్వం సెట్స్ మీద ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: