ఒకబ్యూటీ ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా రెండు దశాబ్దాలుగా కొనసాగడం సాధ్యం అయ్యే పనికాదు. అయితే నటిగా బరువైన పాత్రలను నటించే విషయంలో పెద్దగా పేరులేని శ్రియ ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా సీనియర్ హీరోలకు హీరోయిన్ ఆప్క్షన్ గా ఈరోజువరకు కొనసాగుతూనే ఉంది. సీనియర్ హీరోలతో పాటు ఇండస్ట్రీలోని అనేకమంది టాప్ యంగ్ హీరోలతో నటించిన ట్రాక్ రికార్డ్ శ్రియ కు ఉంది. తెలుగు తమిళ కన్నడ  హిందీ మలయాళ భాషల్లో ఎన్నోసినిమాలు చేసిన శ్ర్రియకు ఎంతమంది కొత్త హీరోయిన్ లు వచ్చినా ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.  


లాక్ డౌన్ ప్రారంభం అవ్వక ముందు శ్రియ తన భర్తతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాకు వెళ్ళి ప్రస్తుతం ఇండియాకు తిరిగి వచ్చే మార్గంలేక శ్రియ అక్కడే చిక్కుకుపోయి చేయడానికి ఏపని లేకపోవడంతో తరుచు తన అభిమానులతో సోషల్ మీడియాలో ఛాట్ చేస్తోంది.  


ఈమధ్య శ్రియ తన అభిమానులతో ఛాట్ చేస్తున్నప్పుడు కొంతమంది అభిమానులు టాప్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పమని అడిగారు. దీనితో శ్రియ రెచ్చిపోతు తాను గతంలో నటించిన హీరోల గురించి కామెంట్స్ చేసింది. ప్రభాస్ కళ్ళు బాగుంటాయని ఎవరికైనా ఆకళ్ళను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందని కామెంట్స్ చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక పవర్ హౌస్ అంటూ ఆయనతో నటిస్తున్నప్పుడు తాను అనేక విషయాలను నేర్చుకున్నాను అని చెపుతోంది.


మొదట్లో ఎన్టీఆర్ ను చూసినప్పుడు చాల సైలెంట్ గా కనిపించే వాడని అయితే ఇప్పుడు అతడు పూర్తిగా మారిపోయాడు అని కామెంట్స్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి కామెంట్స్ చేస్తూ అతడు ఒక పుస్తకాల పురుగు అంటూ నాగార్జునతో నటిస్తున్నప్పుడు ఒక సొంత వ్యక్తి పక్కన ఉన్నాను అన్న ఫీలింగ్ తనకు కలిగింది అని కామెంట్స్ చేసింది.


అలాగే మహేష్ వెంకటేష్ లతో పాటు అనేకమంది హీరోల వ్యక్తిత్వం పై కామెంట్స్ చేయడమే కాకుండా కరోనా వచ్చి చాలా విషయాలను నేర్పిందని. దీనివలన జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని శ్రియ అభిప్రాయ పడుతూ తాను ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఒక కీలకపాత్రను చేయబోతున్న రాజమౌళి ప్రకటించకుండానే లీక్ చేసింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: