శ్రియా శరణ్. హాటీ స్వీటీ బ్యూటీ. 2001లో వచ్చిన ఉషాకిరణ్ మూవీస్ వారి ఇష్టం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ. ఇప్పటికి రెండు దశాబ్దాలు అవుతున్నా తరగని అందంతో ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉంది. శ్రియలో గమ్మత్తు ఏంటో కానీ గ్లామర్, ఏజ్ అలాగే అచ్చమైన పదహారు ప్రాయంలోనే ఉండిపోయాయి.

IHG

శ్రియా టాప్ రేంజి సీనియర్ హీరోల పక్కన నటించింది. ఆ తరువాత వరసలోని హీరోలతో కూడా యాక్ట్ చేసింది. అభినయంతో పాటు అందం కూడా నిండుగా ఉన్న శ్రియ పెళ్ళి చేసుకున్నాక కూడా మరింత రొమాంటిక్ గా కనిపిస్తోంది. ఎక్కడా తగ్గను అంటోంది. ఆమె వయసు ఇపుడు మూడున్నర పదులు దాటేసింది.

 

IHG

అయినా కొత్త హీరోయిన్లకు పోటీగా నిలబడుతోంది. ఆమె తాజాగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీలో అజయ్ దేవగణ్ పక్కన మంచి పాత్ర కోసం సెలెక్ట్ అయింది. రాజమౌళి మూవీ అంటే చాలా ప్రాధాన్యత ఉండడమే కాదు, సూపర్ హిట్ అన్న టాక్ ఉంటుంది. దాంతో ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మళ్ళీ శ్రియ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

IHG

ఇక సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్, ఫస్ట్ చాయిస్ కూడా శ్రియ అంటున్నారు. బాలయ్యతో ఇప్పటికి మూడు సార్లు జత కట్టిన శ్రియ మరో ఇద్దరు సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ మూవీస్ లో నటించి వారితోనూ హిట్లు పంచుకుంది. తాను ఇప్పటికింకా పదహారే అంటూ ప్రాయం అందాలు ఒలకబోస్తున్న  శ్రియ  ఇన్స్టాగ్రాం పిక్స్ ఈనాటి కుర్రకారునూ పిచ్చెక్కిస్తున్నాయంటే శ్రియ గ్లామర్ కే గ్రామర్ చెప్పిందనుకోవాలి.

 

IHG

ఏది ఏమైనా ఓ వైపు భర్త అండ్రూస్ తో రోమాంటిక్ ఫోజులు ఇస్తున్న శ్రియ అదే ఊపులో అభిమానులనూ అలరిస్తోంది.   ఎప్పటికి అపుడు వర్కౌట్స్ చేస్తూ మంచి ఫిజిక్ ను  మెయింటెయిన్ చేస్తున్న శ్రియా చాన్స్ ఇస్తే చాలు అందంతో కొడతాను అంటోంది. మరి ఆమెను రెండు కళ్ళకు కట్టేసుకున్న ఫ్యాన్స్ బోలెడు మంది ఉన్నారు. వారందరి కోసం రాజమౌళి తన ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: