ఆమెది ఆకర్షించే అందం. ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే ప్రతిభవంతురాలు. హీరో తో పోటీ పడి స్టెప్పులు వేయగల సత్తా ఉన్న ఆమె. ఈ క్వాలిటీస్ తో అందాల తారలు హీరోయిన్ గా విజయాలను, అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ రోల్ పోషించిన నటీమణి యువకులకు నిద్ర లేకుండా చేశారు. ఆనాడు హీరోయిన్ గా అలరించి ఈనాడు తల్లి పాత్రలకు ప్రాణం పోస్తుంది. తమ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. సినిమా విజయాలకు దోహద పడుతున్నారు. అలా అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్ రోహిణి.

 

 

రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీ రంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. మలయాళంలో ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించింది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజులో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది.

 

 

ఇష్క్‌లో కూడా రోహిణి తన వాయిస్ తోనే ఆ పాత్రను సగం పండించింది. అలా మొదలైందిలో నానీ కి అమ్మగా నటించిన రోహిణి,ప్రముఖ నటుడు రఘువరన్ భార్యాభర్తలు. తెలుగులో రోహిణి హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే అని చెప్పుకోవాలి. నటిగా కన్నా కూడా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రోహిణి బాగా పాపులర్‌ అయింది. ఇదే కాకుండా రోహిణిలో మరో యాంగిల్‌ కూడా ఉంది. అదే మేకప్‌ ఆర్టిస్ట్‌. చాలా మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువు ఇచ్చే రోహిణి అమ్మ, అక్కా, ఆంటీ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మద్యకాలంలో బహుబలిలో ప్రభాస్ కు అమ్మగా మంచి మార్కులే కొట్టేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: