వెండి తెరపై అమ్మ కేరక్టర్లకు మంచి ప్రత్యేకత ఉంది. అమ్మ అనే సేంట్ మెంట్ ఆ పాత్రను ఎక్కడికో తీసుకెళ్తుంది. తెలుగు సినిమాల్లో అమ్మ కేరక్టర్లు అంటే ఇన్నేళ్లూ ఓ ట్రెండ్ లో ఉండిపోయారు. సెంటిమెంట్, ఏడుపులు, అప్పుడప్పుడూ బాధ్యతలు.. ఇలాంటి మూస రోల్స్ నుంచి టాలీవుడ్ అమ్మలు బైటకి వచ్చేస్తున్నారు. కొత్త తరం దర్శకులు.. మదర్ కేరక్టర్ ని వైవిధ్యంగా చూపించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం.

 

 

అమ్మ లాలన గురించి అందంగా వర్ణించారు. అయితే, అమ్మగా ఆ పాత్రలో ఒదిగిపోయి వెండితెరపై చిరస్మరణీయంగా నిలిచిపోయేలా నటించారు కొందరు నటీమణులు. సినిమా చూసే సగటు తెలుగు ప్రేక్షకుడికి తన తల్లే గుర్తుకు వచ్చేంత సహజంగా ఆ పాత్రలో లీనమయ్యారు. అలాంటి కొంత మంది వెండితెర మాతృమూర్తులలో ఒక్కరే తులసి.

 


సంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన తులసి ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘శంకరాభరణం'లో నటించింది. ఆ సినిమాతో తులసి పేరు మారుమ్రోగిపోయింది. శంకారాభరణం సినిమాతో తులసి తెలుగునాట ఇంటింటా ఆమె పోషించిన పాత్ర పేరు తులసీరామ్ గా  పేరు తెచ్చుకొన్నది. కథానాయకిగా తులసి తొలిచిత్రం జంధ్యాల దర్శకత్వం వహించిన ముద్ద మందారం. ఈ సినిమాలో ప్రదీపు మరదలుగా తులసి నటించింది. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా మారి పలు సినిమాల్లో నటించినా అనుకున్న గుర్తింపు మాత్రం రాలేదు. పెళ్లి చేసుకున్న తరువాత చాలా సంవత్సరాలకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది తులసి. అమ్మ, అక్క పాత్రలు చేస్తోంది.

 

 

తులసి ఏ పాత్ర ఎంచుకున్న దానికి న్యాయం చేస్తుంది. కొంత మంది డైరెక్టర్లు తులసిని దృష్టిలో పెట్టుకొనే ఆమెకు పాత్రలు రాస్తారు. అయితే బిచ్చగాడు సినిమాలో అమ్మ పాత్ర తులసి కోసమే రాశారు. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన ఆమె ఆ పాత్రను చేయలేక పోయారు. పూరి జగన్నాధ్ కూడా ఆమెను దృష్టిలో పెట్టుకునే ఆమెకు పాత్రలు రాస్తారు. నాటి తరం నుండి నేటి తరం వరకు తనదైన ముద్ర వేసుకున్న నటి తులసి.

మరింత సమాచారం తెలుసుకోండి: