చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల బృందం ఈరోజు మధ్యాన్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి రంగం సిద్ధం అయింది. అయితే ముఖ్యమంత్రిని కలిసే టీమ్ లో 25 మంది సభ్యులను తీసుకు వెళ్ళాలి అని చిరంజీవి చేసిన ప్రయత్నాలకు ఊహించని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. 


ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్-19 కు సంబంధించిన అన్ని రూల్స్ ను చాల ఖచ్చితంగా పాటిస్తున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి జగన్ నేరుగా 25 మంది టాలీవుడ్ ప్రముఖులను కలవడం జరగదని అందువల్ల ముఖ్యమంత్రిని కలిసే టీమ్ లో 3 నుంచి 5 మందిని మాత్రమే అనుమతిస్తాము అని చెప్పడంతో చిరంజీవి అతి కష్టంమీద ఆ సంఖ్యను 8 మందికి పెంచే విషయంలో ప్రభుత్వ అనుమతులు తీసుకోవడానికి చాల కష్టపడవలసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రిని కలుస్తుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల టీమ్ లో చిరంజీవి నాగార్జున శ్యామ్ ప్రసాద్ రెడ్డి జెమిని కిరణ్ రాజమౌళి త్రివిక్రమ్ సురేశ్ బాబు లతో పాటు ఎవరు ఊహించని విధంగా జీవితకు కూడ స్థానం లభించడంతో చిరంజీవి తాను అందరివాడిని అని తెలుపుకునే ముద్ర కోసం తాపత్రయ పడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సమావేశంలో ఈమధ్య ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ డోర్ లో జరిగే షూటింగ్ ల నిమిత్తం వసూలు చేసే ఫీజును రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా విశాఖపట్నంలో ఫిలిం ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అన్న విషయమై కూడ కీలక చర్చలు ఈరోజు జరగబోతున్నట్లు టాక్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవాలి అన్న ఉద్దేశ్యంతో అనేకమంది ప్రముఖులు చిరంజీవితో కలిసి వెళ్ళాలి అని భావిస్తున్న తరుణంలో ఇలా ముఖ్యమంత్రిని కలిసే టీమ్ సభ్యుల సంఖ్య తగ్గిపోవడంతో వారంతా నిరాశ పడుతున్నట్లు టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: