శ్రీకాంత్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఖడ్గం సినిమాలో సీతా లక్ష్మి అనే సపోర్టింగ్ పాత్రలో నటించి బెస్ట్ సపోర్టింగ్ ఫిలింఫేర్ నటీమణిగా అవార్డు పొందింది, బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా ఆమెకు లభించింది. పల్లెటూరు పిల్ల పాత్రలో నటించిన సంగీత సినిమాలలో ఓకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ చాలా సహజంగా జీవించేసింది. పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఓరి నీ ప్రేమ బంగారం గాను వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తూనే తమిళం మలయాళం కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. 2004వ సంవత్సరంలో విజయేంద్ర వర్మ చిత్రంలో టెలివిజన్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది. 

IHG
వణక్కం చెన్నై అనే తమిళ చిత్రంలో లాయర్ గిరిజ పాత్రలో నటించి వావ్ అనిపించింది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది. 2020 సంవత్సరం లో మహేష్ బాబు, రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించిన లేరు నీకెవ్వరు చిత్రంలో స్వరాజ్యం అనే క్యారెక్టర్ లో సంగీత నటించిన తనలోని నటించే దమ్ము, ప్రతిభ ఉందని చెప్పకనే చెప్పేసింది. వడ్డే నవీన్ సరసన నా ఊపిరి చిత్రంలో నటించిన సంగీత పాత్ర ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు ఏమో అన్నట్లు ఆమె అత్యంత సహజంగా నటించింది. 

IHG
నటీమణి సంగీత బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు. సినిమాల్లో ఆరంగేట్రం చేయకముందు ఆమె మోడల్ గా కొన్నేళ్ళు కొనసాగింది. తదనంతరం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి నటీమణిగా, ప్లేబ్యాక్ సింగర్ గా దూసుకెళ్లింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటుడిగా రాణించిన క్రిష్ ని 2009వ సంవత్సరంలో పెళ్లాడింది. కాగా 2012వ సంవత్సరంలో వారికి ఒక పండంటి బిడ్డ జన్మించింది. నాలుగు పదుల వయస్సు దాటి ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటీమణి సంగీత అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదు అంటే నమ్మండి.

మరింత సమాచారం తెలుసుకోండి: