తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన రాశి తన కెరీర్ తొలినాళ్లలో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించే ఆపై శుభాకాంక్షలు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన పాపులారిటీని తారా స్థాయికి తీసుకెళ్లింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా లో ఒక స్నేహితురాలిగా నటించింది. అంకురం సినిమాలో సింధూర చెల్లెలిగా నటించింది. 1994లో పలనాటి పౌరుషం లో రాజారావు కూతురిగా నటించి అందరినీ మెప్పించింది. 

IHG
2003వ సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో విలన్ గోపీచంద్ కి ప్రియురాలు గా నటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఎప్పుడూ సుతి మెత్తంగా అందాలను ఒలకబోస్తూ ప్రతి ఒక్కరికి ప్రీతిపాత్రురాలు గా నిలిచే అందాల తార రాశి ఒకేసారి మల్లి అనే నెగెటివ్ రోల్ లో చాలా చక్కగా నటించే సరికి తనలో ఎంత నటన టాలెంట్ ఉందా అని సినీ విమర్శకులు సైతం అవాక్కయ్యారు. 

IHG
నాగ శౌర్య హీరోగా నటించిన కల్యాణ వైభోగమే (2016) చిత్రం లో హీరోయిన్ మాళవిక నాయర్ కి తల్లి పాత్రలో రాశి నటించింది. ఆశిష్ రాజ్, రుక్షర్ మీర్ హీరో హీరోయిన్ గా నటించిన ఆకతాయి (2017) సినిమాలో తన వయసుకు తగ్గట్టుగా హీరో తల్లి పాత్రలో నటించింది. ఈ రెండు సినిమాల ద్వారా పాజిటివ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో మళ్లీ మన మార్క్ చాటుదాం అనుకుంది. కానీ ఏవో కొన్ని కారణాల వలన ఆ రెండు చిత్రాలతో తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కెరీర్ కి స్వస్తి చెప్పింది. ఏదేమైనా తాను తనకిష్టమైన దర్శకుడు ఎస్ ఎస్ నివాస్ ని పెళ్లి చేసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. మునుపటి కంటే చాలా లావెక్కిన రాశి బరువు తగ్గి మళ్ళీ సినిమాల్లో ట్రై చేస్తే ఏ దర్శకుడైనా ఆమెను కళ్ళకద్దుకుని తమ సినిమాల్లో నటింపజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: