దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా ఆ సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో చేసిన పోకిరి సినిమాతో యూత్ ఆడియెన్స్ మనసు గెలుచుకుంది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఇల్లి బేబ్ బాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అక్కడకి షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఛాన్సులు వచ్చినా  పట్టించుకోలేదు. అయితే బాలీవుడ్ లో అమ్మడికి ఆశించిన స్థాయిలో క్రేజ్ దక్కలేదు. 

 

కెరియర్  అటు ఇటుగా ఉన్న టైం లో రష్యన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో అమ్మడి  ప్రేమాయణం అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. కొన్నాళ్ళు ఎంజాయ్ చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. మళ్ళీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ చిట్టి నడుము సుందరి తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. మళ్ళీ మరో మంచి అవకాశం కోసం చూస్తున్న ఇలియానా ఖాళీ టైం లో తన ఫోటో షూట్స్ తో సత్తా చాటుతుంది. 

 

లేటెస్ట్ గా ఇలియానా వర్క్ ఔట్ సెల్ఫీతో అదరగొడుతుంది. నడుము అందాలతో తెలుగు ఆడియెన్స్ ను ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు ఇప్పుడు తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను కవ్విస్తుంది. సరైన ఛాన్స్ రావాలే కానీ మళ్ళీ తను  రెచ్చిపోయేందుకు సిద్ధమే అని హింట్ ఇస్తున్న ఇల్లి బేబ్ తన ఫోటోలతోనే ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్టు టాక్. మరి మళ్ళీ ఇలియానా మునుపటి ఫామ్ తెచ్చుకుంటుందా.. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఇలాంటి టైం లో మళ్ళీ ఇలియానా మాయలో ఆడియెన్స్ పడతారా లేదా అన్నది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: